డబ్బులు వసూలు చేస్తున్న ముఠా అరెస్ట్‌‌‌‌

డబ్బులు వసూలు చేస్తున్న ముఠా అరెస్ట్‌‌‌‌

వెంకటాపురం, వెలుగు : రహదారిపై వెళ్లే వారిని అడ్డగించి, కత్తులు చూపి బెదిరిస్తూ దోపిడీకి పాల్పడుతున్న ముఠాను ములుగు జిల్లా వెంకటాపురం పోలీసులు శుక్రవారం అరెస్ట్‌‌‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సీఐ బండారు కుమార్‌‌‌‌ వెల్లడించారు. వాజేడు మండలం పగళ్లపల్లి గ్రామ శివారులో మంగళవారం కొందరు వ్యక్తులు లారీ డ్రైవర్‌‌‌‌ను బెదిరించి డబ్బులు దోచుకెళ్లారు. దీంతో నల్గొండ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్‌‌‌‌ పి.గోవిందరాజు వెంకటాపురం సీఐకి ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం వాజేడు మండలం జగన్నాథపురం సమీపంలోని వై జంక్షన్‌‌‌‌ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ టైంలో ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ నుంచి వెంకటాపురం వైపు షిఫ్ట్‌‌‌‌ డిజైర్‌‌‌‌ కారులో వస్తున్న ముగ్గురు పోలీసులను చూపి కారు ఆపి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. వెంకటాపురం మండలం వీరభద్రవరం

పాలెం గ్రామాలకు చెందిన కవ్వాల వెంకట శ్రీనివాస్‌‌‌‌, పూనెం దిలీప్, నీరజ్‌‌‌‌కుమార్‌‌‌‌లుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా పగళ్లపల్లి సమీపంలో లారీ డ్రైవర్ల వద్ద డబ్బులు వసూలు చేసింది తామేనని ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి కత్తి, రూ. 1,500, కారు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. సీఐ వెంట వాజేడు ఎస్సై హరీశ్‌‌‌‌, సిబ్బంది ఉన్నారు.