కుత్బుల్లాపూర్: అధికారులను బురిడీ కొట్టిస్తూ, ఫేక్ ల్యాండ్ డాక్యుమెంట్లు సృష్టించి సొమ్ము చేసుకుంటున్న ముఠాను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో కుత్బుల్లాపూర్ బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు పద్మజ రెడ్డి ప్రధాన నిందితురాలుగా ఉన్నారు. పోలీసులు పద్మజతో పాటు మరో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఆదార్ కార్డు మోడీఫికేశన్ మిషన్, ఫేక్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. బాల నగర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ సురేష్ కుమార్ మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు.