ఖమ్మం నగరంలో కల్తీపాల బాగోతం బయటపడింది. గోపాలపురంలో 8వ డివిజన్ లో ఒక ఇల్లును అద్దెకు తీసుకుని హనుమాన్ పాల డైరీ పేరుతో కల్తీ పాలను తయారు చేస్తున్నారు. పాలకేంద్రంలో బాయిలర్ బ్లాస్ట్ కావడంతో కల్తీ పాలు తయారు చేస్తున్న విషయం బయటపడింది.
పాలకేంద్రంలో భారీ మొత్తంలో ఫ్రీడమ్ ఆయిల్ క్యాన్లు, పాలపొడి మిశ్రమాన్ని పోలీసులు, అధికారులు గుర్తించారు. తయారు చేసిన పాలను డెయిరీ కేంద్రాలకు తరలిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు నిర్వాహకులు. అధికారుల తనిఖీల్లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.
కల్తీ పాలు తయారు చేస్తున్న డైరీలో బాయిలర్ బ్లాస్ట్ అవడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భారీ స్థాయిలో బాయిలర్ బ్లాస్ట్ అయినా కూడా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. డైరీ ఫామ్ లో పనిచేసే మహిళ తలకు గాయమైంది. బాయిలర్ అకస్మాత్తుగా పేలడంతో ఆ పేలుడి దాటికి ప్రహరీ గోడ పూర్తిగా పడిపోయింది.