జనగామ జిల్లాను హడలెత్తిస్తోన్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠా

జనగామ జిల్లాను హడలెత్తిస్తోన్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠా

జనగామ జిల్లాను అంతర్ రాష్ట్ర దొంగల ముఠా హడలెత్తిస్తోంది. జిల్లా కేంద్రంలో వరుస దొంగతనాలతో ప్రజలకు, పోలీసులకు దొంగలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.  చేతిలో ఇనుప రాడ్ లు, మారణాయుధాలతో అర్థరాత్రి వీధుల్లో తిరుగుతూ హల్ చల్ చేస్తున్నారు. పలు కాలనీలో సంచరిస్తున్న దొంగల ముఠాకు సంబంధించిన వీడియోలు సీసీ కెమెరా ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు.. అలర్ట్ అయ్యారు.

తాళం వేసి ఉన్న ఇండ్లే టార్గెట్ చేసి దొంగలు దొంగతనానికి పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ దొంగల ముఠా బీహార్, మధ్యప్రదేశ్ కు చెందినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో జిల్లాలో జరుగుతున్న వరుస దొంగతనాలను చేధించడం పోలీసులకు సవాలుగా మారింది. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి మరీ ఈ అంతర్ రాష్ట్ర ముఠా ఇళ్ళలో చోరీలకు పాల్పడుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు.