మెయింటనెన్సే నెలకు రూ.25 వేలు కట్టించుకుంటున్న ఈ గేటెడ్ కమ్యూనిటీలో దొంగలు పడ్డారు..!

మెయింటనెన్సే నెలకు  రూ.25 వేలు కట్టించుకుంటున్న ఈ గేటెడ్ కమ్యూనిటీలో దొంగలు పడ్డారు..!

హైదరాబాద్: 24 గంటలూ నిఘా నీడలో గేటెడ్ కమ్యూనిటీలను కూడా దొంగలు వదిలిపెట్టడం లేదు. హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలోని కొండాపూర్లోని వేస్సేల్లా వుడ్స్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలో దొంగల ముఠా హల్చల్ చేసింది. అర్ధరాత్రి ఈ గేటెడ్ కమ్యూనిటీలోకి ప్రవేశించిన ముఠా విల్లాస్లోకి ప్రవేశించి డోర్లు బద్దలు కొట్టడానికి ప్రయత్నించారు. అయితే.. డోర్లు ఓపెన్ కాకపోవడంతో ఈ దొంగల యత్నం విఫలమైంది. దీంతో.. ఈ దొంగల ముఠా ఖాళీ చేతులతో వెనుదిరిగి వెళ్లిపోయింది.

గేట్స్ దగ్గర సెక్యూరిటీ ఉన్నా దొంగలు ఎలా ప్రవేశించారని ఈ గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ కొన్న యజమానులు మండిపడుతున్నారు. ప్రతి నెలా మెయింటనెన్స్ పేరుతో 25 వేల రూపాయలు వసూలు చేస్తూ కనీసం సెక్యూరిటీ కల్పించలేకపోతున్న విల్లాస్ వెల్ఫేర్ అస్సోసియేషన్పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ దొంగల ముఠా గురించి కూడా దొంగల కదలికలు సీసీటీవీలో రికార్డు కావడంతో బయటకు తెలిసింది.

ALSO READ | అవాక్కయ్యారా : అగ్గిపెట్టె సైజు గది.. అద్దె 25 వేలా..?

సిటీ శివారులోని గేటెడ్ కమ్యూనిటీల్లో కొన్నేళ్ల క్రితం వరుస చోరీలు కలకలం రేపాయి. ఇప్పుడు ఏకంగా.. గచ్చిబౌలి, కొండాపూర్ లాంటి ఏరియాల్లోని గేటెడ్ కమ్యూనిటీలను దొంగలు టార్గెట్ చేయడం ఆందోళన కలిగిస్తుంది. 2024 జులైలో కూడా నాగోల్ పరిధిలోని పత్తుల్లాగూడలో ఉన్న గోల్డెన్ దివీస్ గేటెడ్ కమ్యూనిటీలోని రెండు ఇండ్ల (విల్లా నంబర్ 22, 89)లోకి అర్ధరాత్రి దుండగులు చొరబడ్డారు. 

నంబర్ 89లో హేమలత తన కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలకు వెళ్లగా, ఇంటి తాళాన్ని దొంగలు పగలగొట్టి 50 తులాల బంగారంతోపాటు విలువైన డైమండ్ ఆభరణాలు, రూ.1 లక్ష నగదు ఎత్తుకెళ్లారు. విల్లా నంబర్ 22లో ఎటువంటి వస్తువులు పోలేదని బాధితులు పేర్కొన్నారు.