వాహనాల దొంగ ముఠా అరెస్టు

వాహనాల దొంగ ముఠా అరెస్టు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : వాహనాల దొంగల ముఠాను కొత్తగూడెం వన్​ టౌన్​ పోలీసులు శనివారం పట్టుకున్నారు. కేసు వివరాలను సీఐ కరుణాకర్​ వివరించారు. కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో వెహికిల్స్​తనిఖీ చేస్తుండగా, కారులో అనుమానాస్పదంగా కనిపించిన ఏడుగురిని అదుపులోకి తీసుకొని విచారించామన్నారు. విచారణలో ఆ ఏడుగురు వెహికిల్స్​ దొంగలించే ముఠాగా గుర్తించామన్నారు.

వీఎం బంజర, పెనుబల్లికి చెందిన గోపి, శ్రీను అనే ఇద్దరు వ్యక్తులు చుంచుపల్లి మండలంలోని విద్యానగర్​ కాలనీలో కొంతకాలంగా నివాసం ఉంటున్నారని తెలిపారు. వీఎం బంజరకు చెందిన ముత్తారావు, శివరాం, కోటయ్య, గద్దల శివ, లక్ష్మణ్​రావులతో కలిసి వీరు ముఠాగా ఏర్పడి వెహికిల్స్​ దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. వీరి వద్ద నుంచి కారు, మూడు ఆటోలు, బైక్​ స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.