ఒరిస్సా నుంచి హ్యాష్ ఆయిల్, బీహార్ నుంచి గంజాయి చాక్లెట్ తీసుకువచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్న ముఠాలను పట్టుకున్నట్లు రాచకొండ సీపీ సుదీర్ బాబు తెలిపారు. ఇరత రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. నిందితులు వైజాగ్ నుంచి హ్యాష్ ఆయిల్ తక్కువ రేటుకు తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్లులో ప్యాక్ చేసి హైదరాబాద్ లో ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. ఈ ముఠాలో మొత్తం ఐదుగురు నిందితులు ఉన్నారని.. వారిలో రంజిత్ కుమార్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడని పోలీసులు వెల్లడించారు. అతను డ్రైవర్ గా ఉంటూ డ్రగ్స్ పెడ్లర్ గా చేస్తున్నాడని తెలిపారు. నిందితుల నుంచి 2.3 కేజీల హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు.
మరో కేసులో 3.8 కేజీల గంజాయి చాక్లెట్లను సీజ్ చేశారు. గంజాయి చాక్లెట్లను గుర్తించడం కష్టం కాబట్టి నిందితులు చాలా తేలిగ్గా వీటిని విక్రయిస్తున్నారని సీపీ సుధీర్ బాబు చెప్పారు. సంతోష్, బీరేందర్ సింగ్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారు బీహర్ కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.