హైదరాబాద్ లో సెంట్రల్ క్రైం స్టేషన్ పోలీసులు కార్ల చోరీకి పాల్పడుతున్న ఓ ముఠాను పట్టుకుంది. పురాణపూల్ దగ్గర వాహనాల తనిఖీ నిర్వహిస్తుండంగా సీసీఎస్ పోలీసులకు నెంబర్ ప్లేట్ లేకుండా ఓ i20 కారు కనిపించింది. పోలీసులు నుండి తప్పించుకొవాలని ప్రయత్నించి పరారవుతున్న డ్రైవర్ లావన్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ALSO READ :- ఐదేళ్లుగా ఏపీ దోపిడీకి గురైంది...వైసీపీ గడీలు బద్దలు కొడతాం: పవన్ కళ్యాణ్
లావన్ ను విచారించగా అసలు వ్యవహారం బయట పడింది. ఢిల్లీలో 12 కారులను చోరీ చేసి ఇక్కడ ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టారు. మూడున్నర కోట్ల విలువైన 12 బ్రాండ్ కారులను నిందితుల నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలోని ఆరుగురిని అరెస్ట్ చేశారు.