కాటారం, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుమ్మళ్లపల్లిలో బుధవారం గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఓ గుడిసె పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల కథనం ప్రకారం..గుమ్మళ్లపల్లికి చెందిన సోయం మల్లయ్య కుటుంబసభ్యులు బుధవారం ఇంటికి తాళం వేసి కూలి పనులకు వెళ్లారు. గ్యాస్ సిలిండర్ లీకై పేలడంతో గుడిసె దగ్ధమైంది.
ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. డబ్బులు, బంగారం, పత్తి, ఇతర సామాన్లు కాలిపోయాయని, సుమారు రూ.లక్ష వరకు ఆస్తి నష్టం సంభవించిందని యజమాని మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు స్పందించి తనను ఆదుకోవాలని వేడుకున్నాడు.