సీసీ కెమెరాలో దెయ్యం కనిపించిందంట.. అది కూడా నల్లగా.. సినిమాలో చూపించినట్లు కనిపించిందంట.. ఈ మాత్రం చాలు పల్లెల్లో భయం పుట్టించటానికి.. ఇప్పుడు ఇలాంటి ఘటనే ఖమ్మం జిల్లా వైఎస్ఆర్ నగర్ లో హల్ చల్ చేస్తుంది. కాలనీలోని ఓ ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో దెయ్యం కనిపించిందంటు మొదలైన ప్రచారం.. కాలనీ మొత్తాన్ని భయంలోకి వెట్టింది. సీసీ కెమెరాలో రికార్డయిన సదరు దెయ్యం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో ఊరు మొత్తం దెయ్యం భయంతో వణికిపోతోంది.
సైన్స్ ఇంతగా అభివృద్ధి చెంది, ఏలియన్స్ తో సైతం కమ్యూనికేట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న ఈ రోజుల్లో కూడా దెయ్యం భయం ఏంటని కొందరు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అసలు అది దెయ్యమే కాదని, మనిషి నీడలా ఉందని, లైటింగ్ లో అలా వింత ఆకారంలా కనిపించి ఉంటుందని ఇంకొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
వీడియోను జాగ్రత్తగా చూడండి.. ఓ నల్లటి నీడ కనిపిస్తుంది.. అదే దెయ్యం అంట.. 😇🤣 pic.twitter.com/5hTEO8rCZ4
— raghu addanki (@raghuaddanki1) August 28, 2024
Also Rad :- యూట్యూబ్ వీడియోలు, రీల్స్ చేస్తే రూ. 8 లక్షలు.. ఎక్కడంటే ?
ఏది ఏమైనా ఒక చిన్న వీడియో ఊరు మొత్తాన్ని దెయ్యం భయంతో వణికేలా చేసిందని చెప్పాలి. అరచేతిలో ప్రపంచాన్ని చూడగలుగుతున్ననేటిరోజుల్లో కూడా మనిషిని దెయ్యం భయం వీడకపోవటం ఒకింత హాస్యాస్పదమని చెప్పాలి. ఇంకా నయం ఇటీవల ఎక్కడో లైటింగ్ కి ఏర్పడ్డ నీడను ఏలియన్ అంటూ ప్రచారం చేసినట్లు ఈ వీడియోను కూడా ఏలియన్ అని ప్రచారం చేయలేదు.