ఆరేళ్ల చిన్నారి.. ఎంత సున్నితంగా ఉంటుంది.. దెబ్బ తగిలితేనే మన భరించలేం.. చూస్తూ ఉండలేం.. అలాంటి చిన్నారి పైనుంచి లారీ వెళ్లింది.. హైదరాబాద్ సిటీ నడిబొడ్డున హబ్సిగూడ రోడ్డుపై జరిగిన ఈ ఘటన అందరికీ కన్నీళ్లు తెప్పించింది. స్కూల్‌కు.. తల్లితో కలిసి స్కూటీపై వెళుతుండగా.. లారీ ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో చిన్నారి రోడ్డుపై పడగా.. ఆ ఆరేళ్ల చిన్నారి మీదుగా లారీ వెళ్లింది.. ఇంత విషాధ ఘటన చూసినోళ్లు అందరూ.. అసలు పట్టపగలు సిటీలోకి లారీ ఎలా వచ్చింది.. ఎంట్రీ ఎలా జరిగింది అంటూ నిలదీస్తున్నారు జనం.
ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. హబ్సిగూడలో గురువారం ఇద్దరు పిల్లలతో కలిసి ఓ మహిళ స్కూటీపై వెళ్తోంది. ఈ క్రమంలో వెనక నుండి వచ్చిన లారీ స్కూటిని ఢీకొట్టడంతో ఇద్దరు పిల్లలతో సహ తల్లి రోడ్డుపై పడిపోయారు. ఇది గమనించని లారీ డ్రైవర్ అలాగే ముందుకు వెళ్లాడు. దీంతో ఓ చిన్నారిపై నుండి లారీ దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.
Also Read :- సిగరెట్లు తాగుతున్నారా.. అర్జంట్‌గా ఈ 5 పరీక్షలు చేయించుకోండి..!
స్థానికులు వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానిక గల కారణాలపై ఆరా తీశారు. మృతురాలిని జాన్సన్ గ్రామర్ స్కూల్లో ఆరవ తరగతి చదువుతున్న కామేశ్వరిగా గుర్తించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రమాదానికి కారణమైన లారీని సీజ్ చేశారు. అప్పటి వరకు తమతో కలిసి ఉన్న కూతురు జీవచ్ఛవంలా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో.. అసలు నో ఎంట్రీ టైమ్‌లో సిటీలోకి లారీలు ఎలా వస్తున్నాయని..? ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారని..? పాప మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని మృతరాలి పేరెంట్స్ తో పాటు స్థానికులు విమర్శిస్తున్నారు.