దిస్పూర్: అస్సాంలో 16 ఏండ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనర్పై అత్యాచారం చేసి, ఆమెను చంపి, మృతదేహాన్ని నదిలోకి విసిరేశాడు నిందితుడు. కామ్రూప్ జిల్లాకు చెందిన బాలిక ఓ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. గత సోమవారం తన మొబైల్ ఫోన్ను రీఛార్జ్ చేసుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆ తర్వాత ఆమె ఇంటికి తిరిగి వెళ్లలేదు. కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు.. వెంటనే సోనాపూర్ పోలీసులను ఆశ్రయించారు. బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు..గత శుక్రవారం ఆమె డెడ్ బాడీని దిగారు నదిలో గుర్తించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించగా.. బాలికపై అత్యాచారం జరిగినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దాంతో స్థానికంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని స్థానికులు సోనాపూర్ పోలీస్స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. దాంతో దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు.. నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు. అతనొక ఆటో డ్రైవరని వెల్లడించారు. బాలికను తానే రేప్ చేసి, చంపేసినట్లు నిందితుడు కూడా ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.