
లండన్: బ్రిటీష్ ఇండియన్ బాలిక ప్రిషా తాప్రే (16) ‘ఇంగ్లిష్ చానెల్’ కెనాల్‌ను ఈది రికార్డు సృష్టించింది. లండన్‌లోని బుషే మీడ్స్ స్కూల్లో చదువుతున్న ప్రిషా తాప్రే పేరెంట్స్‌ది ఇండియాలోని మహారాష్ట్ర. తనకు 12 ఏండ్ల వయసున్నప్పుడే ఇంగ్లిష్ చానెల్ కెనాల్‌ను ఈదాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంది. నాలుగేండ్లు ట్రైనింగ్ తీసుకుంది. ఇంగ్లాండ్‌లోని డోవర్ తీరం నుంచి ఫ్రాన్స్‌లోని క్యాప్ గ్రిస్ నెజ్ తీరం వరకు 34 కిలోమీటర్లు 11 గంటల 48 నిమిషాల్లో ఈదింది. ఇదొక చారిటీ ప్రోగ్రామ్ కింద చేపట్టి, రూ.4 లక్షల (3,700 పౌండ్స్) విరాళాలు సేకరించింది. వాటిని అక్షయ పాత్ర ఫౌండేషన్‌కు అందజేసింది.