ఉమ్మడి నల్గొండ జిల్లాలో హాస్టల్ విద్యార్థుల చావులు తల్లిదండ్రులను కలవరపెడుతున్నాయి. యాదాద్రి జిల్లాలో వారం రోజుల క్రితమే ఇద్దరు విద్యార్ధినీలు ఆత్మహత్య చేసుకోగా.. ఈ రోజు సూర్యాపేటలో ఓ గురుకుల పాఠశాల విద్యార్థిని హాస్టల్ గదిలో విగతజీవిగా పడి ఉంది. వివరాల్లోకి వెళ్తే..
హాస్టల్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా ఇమాంపేటలో చేటుచేసుకుంది. ST సొషల్ వెల్ఫేర్ బాలికల గురుకల పాఠశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వైష్ణవి(17) శనివారం రాత్రి హాస్టల్ రూంలో అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే హాస్టల్ సిబ్బంది సూర్యపేట జనరల్ హాస్పిటల్ కు తరలించారు. బాలికలను పరిశీలించిన డాక్టర్ చనిపోయినట్లు నిర్ధారించారు. వైష్ణవి సూర్యాపేట పట్టణానికి చెందిన దగ్గుపాటి వెంకన్న, భాగ్యమ్మల కుమార్తె. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.