కొంతకాలం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. కుక్కల దాడిలో ఇప్పటికే ఎంతోమంది చిన్నారులు తీవ్రంగా గాయపడగా, మరి కొందరు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీధి కుక్కల దాడిలో ఓ బాలిక తీవ్రంగా గాయపడింది.
ఐదవ తరగతి చదువుతున్న అన్విక అనే విద్యార్థిని ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు విచక్షణా రహితంగా దాడి చేసి, తీవ్రంగా గాయపరిచాయి. ఈ ఘటన అల్వాల్ లోని సాయి బృందావన్ కాలనీలో జరిగింది. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన అన్వికను కుటుంబ సభ్యులు నారాయణగూడలోని ఆస్పత్రికి తరలించారు.