టైగర్ నాగేశ్వరరావు రంగస్థలం.. స్టువర్ట్ పురం ఫొటోస్ వైరల్

టైగర్ నాగేశ్వరరావు రంగస్థలం.. స్టువర్ట్ పురం ఫొటోస్ వైరల్

మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వర రావు(Tiger Nageshwara rao).  భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు వంశీ(Vamshee) తెరకెక్కిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ మూవీ రిలీజ్ విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో మాస్ రాజా..దసరా కి మూవీ రాబోతుందంటూ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు.  

లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి షూటింగ్ లొకేషన్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. అలనాటి స్టువర్ట్ పురం(Stuvartpuram) ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అప్పటి వాతావరణంలోని ఆ పూరి గుడిసెలు..సముద్రం తీరాన ఉండే ఇసుక దిబ్బలు..ఊళ్ళో ఉండే నీటి బావి..తాటిచెట్లు..ఇలా ప్రతిదీ పర్ఫెక్ట్ ఉండేలా ప్లాన్ చేశారు డైరెక్టర్ వంశీ. స్టువర్ట్ గ్రామం ఎంట్రీలోనే జంతువుల పుర్రెలు..ఇంటి కప్పులు తనదైన కోణంలో డైరెక్టర్ చూపించారు. టీజర్ లో హైలెట్ అయిన ట్రైన్  సీన్ కు సంబంధించిన గ్రాఫిక్స్ ను గ్రీన్ మ్యాట్ లోనే షూట్ చేసినట్లుగా తెలుస్తోంది. 

రవితేజ ఫ్యాన్స్ కు ఉన్న ఎనర్జీ కి తగ్గట్టుగానే..సినిమా థ్రిల్ అనిపించే విధంగా డైరెక్టర్ సెట్ ప్రపార్టీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తోంది. మరి సినిమా ఆడియన్స్ అంచనాలను ఎంతవరకు రీచ్ అవుతుందో చూడాలి. రీసెంట్గా ఈ మూవీ నుంచి రిలీజైన రెండు సాంగ్స్ ఆడియన్స్ను ఓ ఊపు ఊపేసాయి. అలాగే ఒక్క టీజర్ తోనే ఇండస్ట్రీ మొత్తాన్నే ఆకట్టుకున్న ఈ మూవీ నుంచి..అక్టోబర్‌ 3న ట్రైలర్‌ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Also Read :- గుంటూరు కారంలో ఐటమ్ సాంగ్

ఇక 1970 కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్‌ దొంగగా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది.
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నుపుర్‌ సనన్‌(Nupur saono) హీరోయిన్గా నటిస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్‌ నిర్మిస్తున్న ఈ మూవీలో అనుపమ్ ఖేర్, మురళి శర్మ, రేణు దేశాయ్, గాయత్రీ భార్గవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.