మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ

మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ శివారులోని నేషనల్ హైవే డంపింగ్ యార్డ్ వద్ద శనివారం సాయంత్రం మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు మూడు తులాల బంగారు గొలుసు చోరీ చేశారు. మోర్తాడ్ మండలానికి చెందిన లక్ష్మీ తన భర్తతో కలిసి ఉదయం మోర్తాడ్ నుంచిమాక్లూర్ మండలం మదనపల్లికి వెళ్లింది.

తిరిగి సాయంత్రం పెర్కిట్ మీదుగా మోర్తాడ్ వెళ్తుండగా పెర్కిట్  శివారులోని డంపింగ్ యార్డ్ సమీపంలోకి రాగానే ఎదురుగా బైక్ పై  వచ్చిన వ్యక్తులు బైక్ ను ఆపి మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును లాగి ఆమెను పక్కకు తోసేసి  పరారయ్యారు. ఆగంతకులు బలంగా నెట్టివేయడంతో లక్ష్మి తలకు బలమైన గాయమైంది. ఈ విషయమై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.