మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో కోట్ల రూపాయల గోల్డ్ స్కాం బట్టబయలు అయ్యింది. నాగారం ఐఐ ఎఫ్ ఎల్ గోల్డ్ లోన్ బ్రాంచ్ లో కస్టమర్స్ గోల్డ్ ను వేరే బ్రాంచ్ లో తాకట్టు పెట్టాడు బ్యాంకు మేనేజర్ రాజ్ కుమార్. వచ్చిన డబ్బుతో బెట్టింగ్ ఆడి కోట్లు పోగొట్టుకున్నాడు. కస్టమర్లకు చెందిన 9 కేజీల గోల్డ్ విలువ సుమారు నాలుగు కోట్ల 33 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు. కస్టమర్ల బంగారాన్ని స్వాహా చేసిన రాజ్ కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
మరిన్ని వార్తల కోసం