అమెరికన్లకు స్వర్ణ యుగం రాబోతోంది.. విజయంపై ట్రంప్ ఫస్ట్ రియాక్షన్

అమెరికన్లకు స్వర్ణ యుగం రాబోతోంది..  విజయంపై ట్రంప్ ఫస్ట్ రియాక్షన్

వాషింగ్టన్: అమెరికన్లకు స్వర్ణ యుగం రాబోతోందని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. 2024 నవంబర్ 5న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యేందుకు కావాల్సిన 270 ఎలక్టోరల్ సీట్ల మ్యాజిక్ ఫిగర్‎ను ట్రంప్ రీచ్ అయ్యారు. దీంతో ట్రంప్ విజయం ఖరార్ అయ్యింది. రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందటంతో 2024, నవంబర్ 6 బుధవారం ట్రంప్ జాతినుద్దేశించి ప్రసగించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని అన్నారు. అధ్యక్ష ఎన్నికల యుద్ధంలో రిపబ్లికన్లు శాయశక్తులా పోరాడారని కొనియాడారు. ఈ సారి రిపబ్లికన్ పార్టీకి 315 ఎలక్టోరల్ సీట్లు వచ్చే అవకాశం ఉందని ట్రంప్ అంచనా వేశాడు. పాపులర్ ఓట్లలోనూ రిపబ్లికన్ పార్టీ జోరుగా చూపించిందన్నారు. ఘన విజయం అందించిన అమెరికన్లకు ధన్యవాదాలు తెలిపారు. ఇది అమెరికన్లు సాధించిన గొప్ప విజయమని అన్నారు. ఆర్ధికంగా అమెరికా తిరిగి కోలుకునేందుకు ఈ విజయం దోహదం చేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.