జిల్లాపరిషత్ ఆఫీస్‌లో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఏఈ

జిల్లాపరిషత్ ఆఫీస్‌లో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఏఈ

వరంగల్ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఓ ప్రభుత్వ అధికారి ఏసీబీ ఆఫీసర్లకు పట్టుబడ్డాడు. ఏఈ కార్తీక్ రూ.5 వేల రూపాయలు లంచం తీసుకుంటూ గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాడెండ్ గా దొరికాడు. కాంట్రాక్ బిల్లుల ఫైల్ క్లియరెన్స్ కోసం వర్థన్నపేట మండలం కడారి గూడె కు చెందిన మాజీ సర్పంచ్ సతీష్ ను ఏఈ కార్తీక్ డబ్బులు డిమాండ్ చేశాడు. వెంటనే బాధితుడు ఏసీపీని ఆశ్రయించాడు. హరిత కాకతీయ హోటల్ లో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు ఏఈ కార్తీక్. ఏసీపీ అధికారులు జిల్లా పరిషత్ కార్యాలయంలో విచారణ జరుపుతున్నారు.