పెండ్లికి ఒప్పుకోలేదని.. టీచర్‌ను చంపిండు తమిళనాడులో దారుణం

పెండ్లికి ఒప్పుకోలేదని.. టీచర్‌ను చంపిండు తమిళనాడులో దారుణం

చెన్నై: తనతో పెండ్లికి అంగీకరించలేదని ఓ ప్రభుత్వ స్కూల్ టీచర్​ను దుండగుడు కత్తితో పొడిచి చంపేశాడు. మెడపై లోతైన గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. తమిళనాడులోని తంజావూరులో గురువారం ఈ దారుణం జరిగింది. జిల్లాలోని మల్లిపట్టణం ప్రభుత్వ స్కూళ్లో రమణి(26) టీచర్​గా పనిచేస్తున్నారు. ఇటీవల రమణి కుటుంబ సభ్యులతో మదన్(30) అనే యువకుడి కుటుంబం పెండ్లి గురించి చర్చలు జరిపింది. అయితే, వీళ్లిద్దరి మధ్య సంబంధం కుదరలేదు. తమ పెండ్లి ప్రపోజల్​ను రమణి తిరస్కరించిందని మదన్ కోపం పెంచుకున్నాడు. బుధవారం స్కూలు వద్దకు వచ్చి కత్తితో దాడి చేశాడు. దీంతో కుప్పకూలిన రమణిని తోటి టీచర్లు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. పోలీసులు మదన్​ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అన్​బిల్ మహేశ్ ఘటనను ఖండించారు.