బాన్సువాడ లో ఘనంగా అయ్యప్ప ఆరట్టు ఉత్సవం

బాన్సువాడ లో ఘనంగా అయ్యప్ప ఆరట్టు ఉత్సవం

బాన్సువాడ, వెలుగు : పట్టణంలో అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యంలో అరట్టు మహోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. శబరిమల లో సాంప్రదాయ బద్ధంగా నిర్వహించే ఉత్సవాన్ని బాన్సువాడ లోకూడా నిర్వహించారు.   ఉత్సవ విగ్రహాన్ని పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. అయ్యప్ప ఆలయం వద్ద   ఆలయ కమిటీ అధ్యక్షులు ముదిరెడ్డి విట్టల్ రెడ్డి, శంకర్ గురుస్వామి కొబ్బరికాయ కొట్టి శోభాయాత్ర ప్రారంభించారు.

అయ్యప్ప ఆలయం నుంచి సంగమేశ్వర చౌరస్తా, పాత బాన్సువాడ, చైతన్య కాలనీ మీదుగా  కిష్టయ్య విగ్రహం వద్దకు చేరుకుంది. అక్కడ నుంచి ప్రధాన రహదారి గుండా తాడుకోల్ చౌరస్తా, గాంధీ చౌక్ మీదుగా కల్కి చెరువు వద్దకు చేరుకొని అక్కడ స్వామి వారిని చక్రస్నానం చేయించారు. అనంతరం చెరువు కట్టమీద డోల్ నాగరాజ్ బృందం ఆధ్వర్యంలో అభిషేకాలు నిర్వహించారు. అక్కడ నుంచి తిరిగి అయ్యప్ప ఆలయానికి చేరుకొని పడిపూజ నిర్వహించారు.

అనంతరం అందరికీ అన్న ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా అరట్టు మహోత్సవానికి వచ్చిన శాస్త్రవేత్త, సంఘ సేవకులు పైడి ఎల్లారెడ్డిని ఆలయ కమిటీ శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ గురుస్వామి, మల్లికార్జున్ గురుస్వామి, సాయి రెడ్డి గురు స్వామి, ఆలయ కోశాధికారి ధన్ గారి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు నాగరాజ్ ,వీరప్ప కమిటీ సభ్యులు అరవింద్, రవి, ప్రభాకర్, భాస్కర్ రెడ్డి, దేవకి సురేశ్​ తదితరులు పాల్గొన్నారు.