
జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లిలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న రామాయణ నాటకంలో పట్టాభిషేక మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. కళాకారులు అన్నదమ్ములు, తండ్రీకొడుకుల మధ్య ఉన్న సంబంధాలను కండ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. శ్రీ సీతారామచంద్ర, ఆంజనేయ స్వామికి భక్తులు ఒడి బియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. పట్టాభిషేక మహోత్సవ అనంతరం కాకతీయ విద్యాసంస్థల అధినేత అవిరినేని సుధాకర్‌రావు మహా అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రామాయణ గురువు బోళ్ల కొమురయ్య, పడాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు.