సారలమ్మ వచ్చె.. సంబురం తెచ్చే

  • మేడారం చేరిన పగిడిద్దరాజు, గోవిందరాజులు

వెలుగు నెట్‌‌వర్క్‌‌ : మేడారం అటవీ ప్రాంతమంతా జనారణ్యంగా మారిపోయింది. కన్నేపల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజులు, కొండాయి నుంచి గోవిందరాజులు మేడారంలోని గద్దెలపైకి చేరుకోవడంతో మహాజాతరలో మొదటి ఘట్టం పూర్తైంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో మేడారంతో పాటు

జంపన్న వాగులో ఎటు చూసినా జన ప్రవాహమే కనిపిస్తోంది. భక్తులు జంపన్నవాగులో స్నానాలు చేసి నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించారు. సమ్మక్క నేడు చిలుకలగుట్ట నుంచి మేడారం చేరుకోనుంది. అలాగే ఉమ్మడి వరంగల్‌‌ జిల్లాలోని పలు మండలాల్లో సైతం సమ్మక్క, సారలమ్మ జాతర్లు ప్రారంభం అయ్యాయి.