
కరీంనగర్ టౌన్, వెలుగు: సిటీలోని కిమ్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో ఘనంగా వీడ్కోలు వేడుకలు నిర్వహించారు. శనివారం కాలేజీలో జరిగిన వేడుకలను చైర్మన్ రవీందర్ రావు, వైస్ చైర్మన్ సాకేత్ రామారావు ప్రారంభించారు. వేడుకల్లో స్టూడెంట్స్ డ్యాన్స్‌లు అలరించాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అర్జున్ రావు, లెక్చరర్లు సంపత్ కుమార్, తిరుపతి, స్టూడెంట్స్ పాల్గొన్నారు.