ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

పాల్వంచ, వెలుగు : పాల్వంచలో గర్నమెంట్​ స్కూల్​లో1978లో 10వ తరగతి, 1980లో ఇంటర్మీడియట్ చదువుకున్న విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు.  పట్టణంలోని ఆనందపురం హిల్ రిసార్ట్ లో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఆడుతూ.. పాడుతూ సందడి చేశారు.  కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కాల్వ భాస్కర్, యాకూబ్ పాషా, షేక్ సుభాని, రమేశ్, సుందర రాజన్, ఉషారాణి, రుక్మిణి, లోరా, రమేశ్​పాల్గొన్నారు.

దమ్మపేటలో...

దమ్మపేట, వెలుగు : 1997–98లో పార్కలగండి ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అదే బ్యాచ్​కు చెందిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కూడా  ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  ఎమ్మెల్యే స్నేహితులతో కలిసి కేక్ కట్ చేసి ఆ నాటి తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.