ఉర్లుగొండలో ఘనంగా గట్టు మైసమ్మ జాతర

మోతె (మునగాల), వెలుగు : సూర్యాపేట జిల్లా మోతె మండలం ఉర్లుగొండ గ్రామంలో సోమవారం గట్టు మైసమ్మ జాతర ఘనంగా జరిగింది. వివిధ గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జాతరలో కోదాడ మాజీ ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్, టీపీసీసీ డెలికెట్ సభ్యుడు చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, కోదాడ మున్సిపల్ వైస్ చైర్మన్ కోటేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు రామరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కీసర సంతోశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.