యాదగిరిగుట్టలో వైభవంగా ఉట్లోత్సవం

యాదగిరిగుట్ట, వెలుగు :యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయమైన పాతగుట్టలో 27 నుంచి నిర్వహిస్తున్న శ్రీకృష్ణాష్టమి వేడుకలు గురువారంతో ముగిశాయి. గురువారం ఉట్లోత్సవం, రుక్మిణీ కల్యాణం నిర్వహించారు. ప్రధానాలయం తూర్పు వైపున ఏర్పాటు చేసిన ఉట్లోత్సవంలో ఆలయ సిబ్బందితో పాటు స్థానిక యువకులు పోటీ పడి ఉట్లు కొట్టారు. ఆలయ ఈవో భాస్కర్‌రావు ఉట్లోత్సవాన్ని ప్రారంభించారు. రాత్రి రుక్మిణీ కల్యాణం నిర్వహించారు. కల్యాణోత్సవంలో ఈవో భాస్కర్‌రావు, చైర్మన్‌ నరసింహమూర్తి, డిప్యూటీ ఈవో దోర్భల భాస్కర్‌, ఏఈవో జూషెట్టి కృష్ణ గౌడ్‌ పాల్గొన్నారు.