పొట్టి శ్రీరాములుకు ఘన నివాళి

పొట్టి శ్రీరాములుకు ఘన నివాళి

అన్నపురెడ్డిపల్లి, వెలుగు : పొట్టి శ్రీరాములు వర్థంతి సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలోని పంచాయితీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి ఆర్యవైశ్యసంఘ నాయకులు పూల మాలలు వేసినివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్రాన్ని సాధించి అమరజీవిగా నిలిచారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వనమా గాంధీ, పూర్ణచందర్​రావు, శ్రీను, నాగయ్య, సీతయ్య, పుల్లరావు తదితరులు పాల్గొన్నారు.