ఎల్బీనగర్,వెలుగు: పండుగ సాయన్న తెలంగాణ రాబిన్ హుడ్ అని నీలం మధు అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ లోని చంద చెరువు కట్టపై ఏర్పాటు చేసిన పండగ సాయన్న విగ్రహాన్ని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో కలిసి నీలం మధు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఆకలితో అల్లాడుతున్న గ్రామాల్లో పండగ సాయన్న అడుగు పెట్టి వారి కడుపు నింపి పండుగ వాతావరణాన్ని తెచ్చేవాడని, అందుకే పండుగ సాయన్న అనే పేరు వచ్చిందన్నారు.
ఆ వీరుడి స్ఫూర్తితో ముందుకు కదిలి పేదల పక్షాన నిలబడాలని పిలుపునిచ్చారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్, కార్పొరేటర్లు రేఖ, పద్మ పాల్గొన్నారు.