Viral Video: లక్నోలో ఘోరం.. మహిళ బైక్పై వెళ్తుంటే ఎంత చెత్త పని చేశారో చూడండి..

Viral Video: లక్నోలో ఘోరం.. మహిళ బైక్పై వెళ్తుంటే ఎంత చెత్త పని చేశారో చూడండి..

లక్నో: ఉత్తరప్రదేశ్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. పట్టపగలు అందరూ చూస్తుండగా ఒక ఆకతాయి గుంపంతా కలిసి ఒక మహిళను ఇబ్బందిపెట్టారు. తప్పుగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. యూపీలోని ఏదో మారుమూల గ్రామంలో జరిగిన ఘటన కాదిది. ఉత్తరప్రదేశ్ రాజధాని నగరం లక్నోలో జరిగిన ఘటన ఇది. ఆకతాయిల ప్రవర్తనపై నెటిజన్లు భగ్గమన్నారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

 

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు రోడ్లు నదులను తలపిస్తూ నీటి ప్రవాహంతో నిండిపోయి ఉన్నాయి. లక్నోలో తాజ్ హోటల్ బ్రిడ్జ్ దగ్గర కూడా దాదాపుగా ఇలాంటి పరిస్థితే ఉంది. నగర వాసులు నిత్యం రాకపోకలు సాగించే బ్రిడ్జ్ అది. దీంతో.. మోకాళ్ల లోతు నీళ్లు నిలిచినా ఆ బ్రిడ్జ్ పైనే వాహనదారులు నానా తిప్పలు పడుతూ వెళుతున్నారు. కార్లు, బైకులు అదే రోడ్లో బ్రిడ్జిపై నుంచి వెళుతున్నాయి. ఆ బ్రిడ్జ్పై వరద నీరు మోకాలు లోతు ఉండటం చూసి కొందరు ఆకతాయిలు రోడ్డుపైకి చేరుకున్నారు. మోకాలి లోతు నీళ్లలో నిల్చుని ఒకరిపై ఒకరు ఆ వరద నీటిని చల్లుకుంటూ సంతోషపడ్డారు.

యూపీలో నిన్నమొన్నటి వరకూ ఎండలు మండిపోయాయి కాబట్టి నీళ్లు నిలిచే వర్షం కురవడంతో సంతోషం పట్టలేక ఇలా ఎంజాయ్ చేశారులే అనుకుని వాహనదారులు కూడా లైట్ తీసుకున్నారు. కానీ.. ఆకతాయిల ఆనందం ఒకానొక సమయానికి హద్దులు మీరింది. ఆ బ్రిడ్జి మీదుగా వచ్చేపోయే వాహనదారులపై నీళ్లు చల్లుతూ ఓవరాక్షన్ చేశారు. దీంతో.. ఆ ఆకతాయిల తీరుతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ఆ సమయంలో అదే బ్రిడ్జ్ మీదుగా ఒక వ్యక్తి వెనుక కూర్చున్న మహిళతో కలిసి బైక్పై వస్తున్నాడు. బైక్పై ఒక మహిళ ఉందన్న విషయం కూడా మర్చిపోయి.. బైక్పై ఉన్న  ఆ వ్యక్తిపై, ఆ మహిళపై నీళ్లు కొడుతూ ఆకతాయిలు ఎక్కువ చేశారు.

 

ఆ వాహనదారుడు అప్పటికీ కొద్దిసేపు ఆకతాయిల ప్రవర్తనతో ఇబ్బందిపడినా ఇక చాలు.. ఆపండని మర్యాదగా చెప్పాడు. ఆ మహిళ కూడా నీళ్లు కొట్టొ్ద్దని చెప్పింది. అయినా సరే.. ఈ ఆకతాయిల గుంపు వాళ్ల మాటను లెక్కచేయలేదు. మరింత రెచ్చిపోయి ఇంకొందరు ఆకతాయిలు కూడా వచ్చి చేరి బైక్పై ఉన్న ఇద్దరిపై నీళ్లు కొట్టారు. దీంతో.. ఆ వ్యక్తి బైక్ అదుపు తప్పి కిందపడింది. ఆ మహిళ నీళ్లలో పడిపోయింది. ఆమెను పైకి లేపి ఆ ఆకతాయిలను హెచ్చరించి సదరు వ్యక్తి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఈ మొత్తం ఘటనను గమనించిన ఒకరు ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. వీడియో చూసిన వారంతా ఆ ఆకతాయిలను కామెంట్ల రూపంలో తెగ తిట్టారు. లక్నో పోలీసుల వరకూ ఈ వీడియో చేరింది. అత్యుత్సాహంతో మహిళను, వాహనదారులను ఇబ్బంది పెట్టిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని, అదుపులోకి తీసుకుంటామని లక్నో పోలీసులు తెలిపారు.