ఎంఎన్​జే, నీలోఫర్​లో వసతుల్లేవ్

  • దవాఖానల్లో పీవైఎల్​, పీవోడబ్ల్యూ  సర్వే

హైదరాబాద్ సిటీ, వెలుగు : సిటీలోని ఎంఎన్​జే, నీలోఫర్ హాస్పిటళ్లలో సౌలత్​లు సరిగ్గా లేవని, వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని పీవైఎల్, పీఓడబ్ల్యూ ప్రతినిధుల బృందం డిమాండ్ చేసింది. ఆయా దవాఖానల్లో బుధవారం వారు సర్వే చేపట్టారు. ఎంఎన్​జే హాస్పిటల్​లో క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారని, పేషంట్​ అటెండర్స్ నిద్రించేందుకు సౌలత్​లు లేవన్నారు. టాయిలెట్స్ సైతం అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. జిల్లాలో సైతం క్యాన్సర్​ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలన్నారు.  

అలాగే నీలోఫర్​లో కూడా రద్దీ ఎక్కువగా ఉందని, ఒక్కో బెడ్ పై ముగ్గురు చిన్నారులను పడుకోబెట్టాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. హాస్పిటల్ దగ్గర ప్రైవేట్ మెడికల్ షాపులు ఉండడం అభ్యంతరంగా ఉందని, పూర్తి స్థాయిలో ప్రభుత్వమే మందులు అందించాలని కోరారు. సర్వేలో పీవైఎల్, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు కె.ఎస్ ప్రదీప్, డీ. స్వరూప పాల్గొన్నారు.