కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని తమిళనాడు ఎమ్మెల్యేల బృందం మంత్రి గంగుల కమలాకర్ ను అభినందించింది. దళితబంధు, ఎస్సీ సబ్ ప్లాన్ పథకాలపై అవగాహన కోసం కరీంనగర్ వచ్చిన ఎమ్మెల్యేల బృందం మంత్రి గంగుల కమలాకర్ ను కలిశారు. ఈ సందర్భంగా దళితబంధు పథకం గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
దళిత సాధికారత కోసం సీఎం కేసీఆర్ చాలా కృషి చేస్తున్నారంటూ తమిళనాడు ఎమ్మెల్యేల బృందం ప్రశంసించింది. దళితబంధుతో పాటుగా మిగిలిన పథకాలు బాగున్నాయని కితాబునిచ్చింది. అనంతరం వారు చొప్పదండి మండలంలోని రుక్మాపూర్ సైనిక్ స్కూల్ ను సందర్శించారు. మంత్రి గంగులను కలిసిన ఎమ్మెల్యేల్లో సింథనై సెల్వన్, బాలాజీ, రిచర్డ్ దేవదాస్, మురుగప్పన్, రమేష్ నాథన్ ఉన్నారు.