క్రికెట్ గ్రౌండ్ లో దారుణం చోటు చేసుకుంది. సరదాగా ఆడే ఆటలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. లక్నోలోని ఇందిరా నగర్ ప్రాంతంలో క్రికెట్ మ్యాచ్‌లో 18 ఏళ్ల యువకుడు గ్రౌండ్ లో ఉమ్మి వేయడంతో కొంతమంది యువకులు ముఖంపై మూత్ర విసర్జన చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ మూత్ర విసర్జన ఆరోపణలను ఖండించారు. ఈ సంఘటన జనవరి 13 న జరిగింది.
ఫిర్యాదుదారు ప్రకారం.. బాధితుడు మధ్యాహ్నం తన సోదరిని పాఠశాల నుండి తీసుకొని రావడానికి వెళ్తున్నప్పుడు కొంతమంది యువకులు తన కొడుకును అడ్డుకున్నారని..బాధితుడి తండ్రి వెల్లడించాడు. తన కొడుకును స్పృహ కోల్పోయే వరకు కొట్టి, అతని ముఖంపై మూత్ర విసర్జన చేశారని ఆరోపించాడు. స్పృహలోకి వచ్చిన తరువాత ఇంటికి చేరుకొని తన కష్టాలను వివరించాడని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇందిరా నగర్ పోలీస్ స్టేషన్‌లో దుండగులపై 506 (నేరపూరిత బెదిరింపు), 504 (అవమానించడం), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 147 (అల్లర్లు) మరియు SC/ST చట్టంలోని సెక్షన్లతో సహా IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. డిప్యూటీ కమిషనర్ (ADCP) నార్త్ అబిజిత్ ఆర్. శంకర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న విచారణ ఆధారంగా చర్యలు తీసుకుంటాము.సాక్ష్యాధారాల ఆధారంగా మాత్రమే చర్య తీసుకోబడుతుందని ఆయన తెలిపారు.
Lucknow youths thrash teen, urinate on him after cricket spat#LucknowNews #IndiraNagar #CricketAssault #YouthNews #CrimeAlert #CasteistSlurs #FIRfiled #UPPolice #IPC #AssaultCase #yespunjabhttps://t.co/suFhdWX2JX .
— YesPunjab.com (For Punjabi follow @BawaHs) (@yespunjab) January 17, 2024