మండీ బిర్యానీలపై పెరుగుతున్న మోజు

 మండీ బిర్యానీలపై పెరుగుతున్న మోజు

ఒకే కంచం...ఆరగించు తలా కొంచెం అనేది అరబిక్‌ సంప్రదాయంలో భాగం. అందరూ కలిసి  ఒకే కంచంలో తినడం మండి స్టైల్. అచ్చం బిర్యానీనే తలపించే ఒకనాటి సంప్రదాయమైన మండీ... నగరవాసులకు లేటెస్ట్‌ క్రేజీ డిష్‌గా మారిపోయింది. దీంతో సిటీలో డిఫరెంట్ మండీలు పబ్లిక్ ని ఆకట్టుకుంటున్నాయి. రెగ్యులర్ బిర్యానీ బోరింగ్ గా ఫీలవుతున్న  జనం.. ఇప్పుడు మండీకి జై కొడుతున్నారు. ఎంచక్కా కింద కూర్చొని ఆప్తులతో ఫుడ్ షేర్ చేసుకుంటున్నారు.

మామూలుగానే బిర్యానీ అంటే లొట్టలు వేసే సిటీ జనం ఇప్పుడు 'మండీ' బిర్యానీ  డిష్ కు ఫిదా అయిపోతున్నారు. తయారీలోనే కాదు...తినే పద్దతిలో కూడా చాలా విలక్షణంగా ఉండే ఈ 'మండీ' బిర్యానీ ఇప్పుడు ప్రత్యేకించి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు హాట్ ఫేవరెట్ డిష్ గా మారింది. దీంతో పబ్లిక్ ని ఆకట్టుకునెలా డిఫరెంట్ నేమ్స్ తో యునిక్ మండీలను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. 

ఆరబిక్ ఫుడ్ కి ప్రస్తుతం సిటీలో ఫుల్ క్రేజ్ ఉంది. దీంతో  సిటీలో ఒకప్పుడు అకడక్కడా కనిపించే మండీ రెస్టారెంట్స్ ఇప్పుడు వందల కొద్దీ కనపడుతున్నాయి. పైగా మండీ బిర్యానీలోను కాంపిటేషన్ పెరగడంతో డిఫరెంట్ స్టెల్స్ లో మండీలను హోటల్ నిర్వాహకులు పరిచయం చెస్తున్నామంటున్నారు.

అందులో భాగంగా రామంతపూర్ లోని ల్యాండ్ మార్కు రెస్టారెంట్ లోని పైసా వసూలు మండీకి యూత్ ఫిదా అవుతున్నారు. రూ.1999 లతో 6 గురు తినేలా ప్లేట్ లో అరిటాకులు వేసి, ఒకవైపు బిర్యానీ, మరోవైపు మండీ బిర్యాని వేసి రోటి, చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్, కాక్ టెయల్స్ కలిపి అందర్నీ సాటిస్ ఫై చెస్తున్నారు. దీంతో పేరుకి తగ్గట్టే పైసా వసూలు మండీ ఉందని పబ్లిక్ అంటున్నారు.

డబల్ డెక్కర్ మండీ సిటీలో ట్రెండింగ్ లో ఉంది.  ఎల్.బి.నగర్ లోని ల్యావిష్ మండీ రెస్టారెంట్ లో ఈ మండి  రూ.1499 లకు ఇంట్రడ్యూస్ చేశారు. డబుల్ డెక్కర్ బస్సుల వలె రెండు అంతస్థుల్లో ఉండడంతో పబ్లిక్ అట్రాక్ట్ అవుతున్నారు. పైగా స్నేహితులతో కలిసి కూర్చుని కబుర్లతో చెప్పుకుంటూ తినడం చాలా ఆనందాన్ని అందిస్తుందంటున్నారు. పైగా ఒక్కప్పుడు హైదరాబాద్ అంటే కేవలం బిర్యానీ అనే వారని, కానీ ప్రస్తుతం మండీ అంటున్నారని చెబుతున్నారు. అందులోనూ రొటీన్ గా కాకుండా కాస్త క్రేజీగా డబుల్ డెక్కర్ మండీ ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సౌదీ అరేబియా, ఒమన్, సోమాలియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రాంతాల్లో మండీ సంప్రదాయం ఎక్కువగా కనిపిస్తోంది. కుటుంబసభ్యులతో లేదా స్నేహితులతో కలిసి గ్రూప్ గా వెళ్లి మండీ బిర్యానీకి ఆర్డర్ ఇచ్చినప్పుడు అందరికీ కలిపి ఒక ఎత్తుపీటపై ఒకే కంచంలో చికెన్‌, మటన్‌తో చేసిన ఆ స్పెషల్ బిర్యానీ వడ్డిస్తారు. ఇప్పుడు సిటీలోనూ ఈ ట్రెండ్ నడుస్తుండడంతో తార్నాకలోని బిగ్ ప్లేట్ రెస్టారెంట్ బిగ్ ప్లేట్ మండీని అందుబాటులోకి తెచ్చారు.  4 ఫీట్స్ ఉండె ఈ ప్లేట్ లో అన్ లిమిటెడ్ రైస్ తో పాటు 6 డిఫరెంట్ నాన్ వెజ్ పీసెస్ తో రూ.1800 లకే వడ్డిస్తున్నారు. దీంతో బర్త్ డే పార్టీస్ కి ఈ మండీ ఫర్పెక్ట్ అంటూ ఆహ్లాదకర వాతావరణంలో అందరూ ఆప్తులతో కలిసి తినడం ఆనందంగా ఉందని పబ్లిక్ అంటున్నారు .

కేవలం మూడేళ్ల  వ్యవధిలోనే మండీ సిటీకి వ్యాపించింది. పాతబస్తీలోని బార్కాస్‌ ప్రాంతంలో ఒకప్పుడు ఇది బాగా పాపులర్‌. కాగా.. ఇప్పుడు నగరవ్యాప్తంగా  భోజన ప్రియుల ఆదరణ పొందుతోంది. ఇప్పుడు మండీని నగరంలోని దాదాపు ప్రతి రెస్టారెంట్‌ అందించడంతో కాంపిటేషన్ బాగా పెరిగిందని  వ్యాపారులు అంటున్నారు. దీంతో కొత్తగా పబ్లిక్ ని ఆకట్టుకునెలా కొత్త కొత్త మండీలు వస్తున్నాయని చెబుతున్నారు. ఎ.యస్ రావ్ నగర్ లోనూ జైష్ మండీ నాటుకోడి మండీని ఇంట్రడ్యూస్ చేసింది. ఇది పబ్లిక్ ని బాగా ఆకట్టుకుంటుదని, సిటీలో ఎక్కడా ఈ తరహా రెస్టారెంట్ లేదని నిర్వాహకులు అంటున్నారు. అటు పబ్లిక్ కూడా కొత్త కొత్త మండీలను తింటూ ఆనందిస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ అంటే కేవలం బిర్యానీకి మాత్రమే పెట్టింది పేరు. కానీ ఇప్పుడు దానికి తోడుగా 'మండీ' కూడా చేరింది. దీంతో  నచ్చిన విందును ఆస్వాదిస్తుంటే ఆ మజానే వేరంటూ అందరూ ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా యూత్ లోనూ ఈ మండీ బిర్యానీపై ఉన్న క్రేజ్ పెరుగుతుండడంతో సిటీలో డిఫరెంట్ మండీస్ ఆకట్టుకుంటున్నాయి.