ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవానీకి 3 నెలల జైలు

ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవానీకి 3 నెలల జైలు

అహ్మదాబాద్‌ : ‘ఆజాదీ మార్చ్’ కేసులో గుజరాత్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానికి మెహసనా కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించింది.  పర్మిషన్ లేకుండానే ఆజాదీ మార్చ్ నిర్వహించారన్న కేసులో జిగ్నేష్ మేవానితో పాటు 9 మందికి శిక్ష ఖరారు చేసింది. ఒక్కొక్కరికి  వెయ్యి రూపాయల చొప్పున ఫైన్  విధించింది. 2017 జులైలో బనస్ కాంతా జిల్లాలో మెహసనా నుంచి ధనేరా వరకు అనుమతి లేకుండా ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని.. ‘ఆజాదీ మార్చ్’ నిర్వహించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మొత్తం 12 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిలో ఒకరు చనిపోగా, మరోకరు పరారీలో ఉన్నారు.

మరిన్ని వార్తల కోసం..

ప్రతిపక్షాలకు దీదీ సవాల్

బీజేపీ, టీఆర్ఎస్ రైతులను మోసం చేస్తున్నాయి