టోలిచౌకిలో గన్​ఫైర్!.. ఎంఐఎం నేత వద్ద రివాల్వర్​ స్వాధీనం

టోలిచౌకిలో గన్​ఫైర్!.. ఎంఐఎం నేత వద్ద రివాల్వర్​ స్వాధీనం

మెహిదీపట్నం, వెలుగు : టోలిచౌకి యూసుఫ్ టేకిడిలో శనివారం అర్ధరాత్రి గన్​ఫైరింగ్ కలకలం సృష్టించింది. స్థానికంగా ఉండే అక్తర్​ఎంఐఎం పార్టీ నాయకుడు. శనివారం రాత్రి11:30 గంటలకు షకీల్ అనే వ్యక్తి అక్తర్ ఇంటికి వచ్చాడు. భూ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో గన్​ఫైర్​అయినట్లు తెలుసుకున్న ఎంఐఎం కార్యకర్తలు అక్కడ గుమిగూడారు. 

ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ కూడా ఘటనా స్థలానికి వచ్చాడు. స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని గన్​ఫైరింగ్​పై ఆరా తీశారు. ఎలాంటి ఫైరింగ్​జరగలేదని తెలిపారు. అయితే అక్తర్ వద్ద ఉన్న రివాల్వర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీఐ బాలకృష్ణ, ఆసిఫ్ నగర్ ఏసీపీ శ్రీనివాస్, బాలకృష్ణ తెలిపారు.