అమెరికా లోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ ఏరియాలో కాల్పుల ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం... టెక్సస్ లోని ఓ మాల్ లో దుండగులు చొరబడ్డారు. అనంతరం తమ వెంట తెచ్చుకున్న తుపాకులతో అక్కడ ఉన్న సాధారణ పౌరులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. చిన్న పిల్లలను సైతం దుండగులు వదల్లేదు.
ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు సహా 9 మంది మృతి చెందారు. అరగంట పాటు కాల్పులు జరిగినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దుండగులపై ఎదురుకాల్పులు చేశారు. ఈ క్రమంలో ఒక దుండగుడు హతమయ్యాడు. మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరుగుతున్న సమయంలో మాల్ నుంచి భయంతో ప్రజలు బయటికి పరుగులు తీశారు.