ఛత్తీస్​గఢ్​లో రివాల్వర్​తో కాల్చుకుని హెడ్​ కానిస్టేబుల్​ ఆత్మహత్య

ఛత్తీస్​గఢ్​లో రివాల్వర్​తో కాల్చుకుని హెడ్​ కానిస్టేబుల్​ ఆత్మహత్య

భద్రాచలం,వెలుగు : తన సర్వీస్​ రివాల్వర్​తో కాల్చుకుని ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలో శుక్రవారం ఓ హెడ్ ​కానిస్టేబుల్​ఆత్మహత్య చేసుకున్నారు. బీజాపూర్​ జిల్లా బైరంగఢ్​ పోలీస్​స్టేషన్​లో అప్కా సోనూ హెడ్​ కానిస్టేబుల్. ఉదయం 9 గంటల సమయంలో బైరంగఢ్​ పోలీస్ స్టేషన్​ఆవరణలో

తన వద్ద ఉన్న సర్వీస్​ రివాల్వర్​తో కణతపై కాల్చుకుని పడిపోయాడు. తోటి జవాన్లు గుర్తించి ఆయనను బైరంగఢ్​ ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయాడు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు బీజాపూర్​ ఎస్పీ జితేంద్ర యాదవ్​  తెలిపారు.