ధర్మపురి ఎన్నికల కౌంటింగ్ వివాదంపై జూన్ 30న హైకోర్టులో విచారణ

ధర్మపురి ఎన్నికల కౌంటింగ్ వివాదంపై శుక్రవారం (జూన్ 30న) హైకోర్టులో విచారణ జరగనుంది. మంత్రి కొప్పుల ఈశ్వర్ కౌంటింగ్ లో అవకతవకలు చేసి, గెలిచారని కొంతకాలంగా కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ పోరాడుతున్న విషయం తెలిసిందే. ఇరువురి సాక్ష్యధారాలపై శుక్రవారం రోజు విచారణ కొనసాగనుంది. మంత్రి కొప్పుల ఈశ్వర్, అడ్లూరి లక్ష్మణ్ ఇరువురి సాక్ష్యధారాలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. 

ఇప్పటికే తమ న్యాయవాదితో కలిసి అడ్లూరి లక్ష్మణ్ కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు.. ఇటు మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా తమ న్యాయవాదులతో కలిసి హైకోర్టుకు హాజరయ్యారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ గత ఎన్నికల్లో అడ్లూరి లక్ష్మణ్ పై కేవలం 400 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కౌంటింగ్ ప్రక్రియ అవకతవకలు, ఈవీఎంల మాయం వంటి విషయాలపై అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించారు.