నిర్మల వర్సెస్ ​ఖర్గే – రాజ్యసభలో రాజ్యాంగంపై వాడీవేడి చర్చ

నిర్మల వర్సెస్ ​ఖర్గే – రాజ్యసభలో రాజ్యాంగంపై వాడీవేడి చర్చ

ఢిల్లీ: రాజ్యసభలో రాజ్యాంగంపై వాడీవేడి చర్చ కొనసాగింది. మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాంధీ ప్రస్తావనతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ కాంగ్రెస్‌ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె వ్యాఖ్యలకు ఏఐసీసీ మల్లికార్జున ఖర్గే అదే స్థాయిలో కౌంటర్‌ ఇచ్చారు. 

నిర్మలా మాట్లాడుతూ ‘కుటుంబం కోసం రాజ్యాంగాన్నే మార్చివేశారు. నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో వాక్ స్వాతంత్య్రాన్ని అరికట్టేలా మొదటి సవరణ జరిగింది. మీడియా సంస్థలు ముఖ్యంగా రాజకీయంతో సంబంధం ఉన్న కీలక అంశాలపై లోతుగా విచారణ జరపరడాన్ని వ్యతిరేకించారు. పత్రికా స్వాతంత్య్రాన్ని తగ్గించేందుకు ఏడాదిలోపే రాజ్యాంగాన్ని సవరించారు. ఇప్పుడు రాజ్యాంగ పరిరక్షణ గురించి స్పీచ్​లు ఇస్తోంది’ అని ఫైర్​అయ్యారు. 

ALSO READ | నెహ్రూ లేఖలపై దుమారం.. మోదీ గతంలోనే బతుకుతున్నారన్న ఖర్గే..!

దీనికి ఖర్గే స్ట్రాంగ్​గా బదులిచ్చారు.‘లోక్‌సభలో రాజ్యాంగ చర్చ ద్వారా ప్రధాని మోదీ సభను తప్పుదోవ పట్టించారు. ఎలా మాట్లాడాలో ఈరోజు నేను వాళ్లకు చెప్పదల్చుకున్నా. నేను చదువుకుంది మున్సిపాలిటీ బడిలో. నిర్మలా సీతారామన్‌ జేఎన్‌యూలోనే చదవొచ్చు. ఆర్థిక నిపుణురాలే కావొచ్చు. కానీ, ఆమె మాట్లాడే విధానమే అస్సలు బాగోలేదు. జాతీయ పతాకాన్ని, అందులో అశోక చక్రాన్ని.. రాజ్యాంగాన్నే ద్వేషించినవాళ్లు.. ఇవాళ మాకు పాఠాలు చెబుతున్నారు. రామ్‌లీలా మైదానంలో గాంధీ, నెహ్రూ, అంబేద్కర్‌ దిష్టిబొమ్మలను తగలబెట్టిన విషయాన్ని వాళ్లు మరిచిపోయారేమో!’’ అని ఖర్గే మండిపడ్డారు.