అరేబియా సముద్రంలో కూలిన హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌ 

అరేబియా సముద్రంలో కూలిన హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌ 
  •  రెస్క్యూ ఆపరేషన్‌‌‌‌కు వెళ్తుండగా ప్రమాదం
  •  ముగ్గురు ఐసీజీ సిబ్బంది గల్లంతు

గాంధీనగర్‌‌‌‌‌‌‌‌(గుజరాత్‌‌‌‌): రెస్క్యూ ఆపరేషన్‌‌‌‌కు వెళ్లిన ఓ హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌ అరేబియా సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు కోస్ట్‌‌‌‌ గార్డు సిబ్బంది గల్లంతు అయ్యారు. మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన గుజరాత్‌‌‌‌లోని పోర్‌‌‌‌‌‌‌‌బందర్‌‌‌‌‌‌‌‌ తీరంలో జరిగింది. పోర్‌‌‌‌‌‌‌‌బందర్‌‌‌‌‌‌‌‌ తీరంలోని ఆయిల్‌‌‌‌ మోటార్‌‌‌‌‌‌‌‌ ట్యాంకర్‌‌‌‌‌‌‌‌ హరి లీలాలో ప్రమాదం జరగడంతో అందులో పనిచేస్తున్న సిబ్బంది గాయపడ్డారు. వారిని తరలించేందుకు సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఇండియన్‌‌‌‌ నేవీకి చెందిన అడ్వాన్స్‌‌‌‌డ్‌‌‌‌ లైట్‌‌‌‌ హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌ (ఏఎల్‌‌‌‌హెచ్‌‌‌‌) వెళ్లింది.

ఎమర్జెన్సీ ల్యాండింగ్‌‌‌‌ చేస్తున్న సమయంలో ఆ హెలికాప్టర్ సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు ఇండియన్‌‌‌‌ కోస్ట్‌‌‌‌ గార్డు (ఐసీజీ) సిబ్బంది గల్లంతు అవ్వగా, మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. మిస్సింగ్‌‌‌‌ అయిన వారిని కాపాడేందుకు ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్‌‌‌‌ కొనసాగిస్తున్నారు. అందుకోసం ఇండియన్‌‌‌‌ నేవీకి చెందిన నాలుగు షిప్‌‌‌‌లను, రెండు ఎయిర్‌‌‌‌‌‌‌‌ క్రాఫ్ట్‌‌‌‌లను పంపించారు.

మోటార్‌‌‌‌‌‌‌‌ ట్యాంకర్‌‌‌‌‌‌‌‌ హరిలీలా పోర్‌‌‌‌‌‌‌‌బందర్‌‌‌‌‌‌‌‌ నుంచి సముద్రంలో 45 కిలోమీటర్ల దూరంలో ఉందని, నౌకను సమీపిస్తుండగా హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌ కూలిపోయిందని వెల్లడించింది. మాస్టర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ది వెసెల్ నుంచి అభ్యర్థన మేరకు తాము హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌ను సముద్రంలోకి పంపించామంది. సముద్రంలో హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌ శకలాలను గుర్తించామని తెలిపింది.