చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పారిజాత పర్వం’. సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహిధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్నారు. ఇదొక హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్. సోమవారం రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది.
ఇందులో చైతన్యరావుతో పాటు సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక, శ్రీకాంత్ అయ్యంగార్ గన్ పట్టుకుని కనిపిస్తుంటే, వైవా హర్ష షాకింగ్‌గా చూస్తున్నాడు. ‘కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్' అనే ట్యాగ్ లైన్ ఉన్న పోస్టర్ ఇంటరెస్టింగ్‌గా ఉంది. త్వరలోనే కాన్సెప్ట్ టీజర్‌ను విడుదల చేయనున్నట్టు తెలియజేశారు మేకర్స్. బాల సరస్వతి కెమరామెన్‌గా వర్క్ చేస్తున్న ఈ చిత్రానికి 'రీ' సంగీతం అందిస్తున్నాడు.