మే 14న హిందూ ఏక్తా యాత్ర

బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆధ్వర్యంలో కరీంనగర్ సిటీలో మే 14వ తేదీన నిర్వహించబోయే హిందూ ఏక్తా యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రకు అస్సాం సీఎం హిమంతబిశ్వ శర్మ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారు. హిందువుల సంఘటిత శక్తిని చాటేందుకు ఏటా హిందూ ఏక్తా యాత్ర పేరిట బండి సంజయ్ భారీ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. 

కరీంనగర్ సిటీలో సాయంత్రం 4 గంటలకు ఆర్యవైశ్య భవన్ వద్ద ప్రారంభమయ్యే ఈ యాత్ర.. రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, శాస్త్రి రోడ్డు, కమాన్ చౌరస్తా, బస్టాండ్, తెలంగాణ చౌక్, ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, కోర్టు చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, గాంధీ చౌరస్తా మీదుగా తిరిగి ఆర్యవైశ్య భవన్ కు చేరుకుంటుంది. హిందువులంతా స్వచ్చందంగా రావాలని పిలుపునిచ్చారు. 

కరీంనగర్ లో బండి సంజయ్ నేతృత్వంలో హిందూ ఏక్తా యాత్ర కొనసాగనుంది. ముఖ్య అతిథిగా అసోం సీఎం హిమంత్ బిశ్వ శర్మతో పాటు ‘ది కేరళ స్టోరీ’ సినిమా యూనిట్ సభ్యులు హాజరుకానున్నారు. 

భారీ బందోబస్తు 

యాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యాత్రలో డీజే వాడరాదని, రెచ్చగొట్టే నినాదాలు చేయరాదని, మారణాయుధాలు ఉపయోగించవద్దని సీపీ సుబ్బారాయుడు ఆదేశాలు జారీ చేశారు. సాధారణ ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. హిందూ ఏక్తాయాత్ర జరిగే మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.