వరంగల్లో ఓ హోంగార్డు ప్రాణాలకు తెగించి మరి సహసం చేశాడు. ట్రైన్ కింద పడి చనిపోవడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని దైర్యం చేసి కాపాడాడు. ఛత్తీస్ఘడ్ నుంచి ఉపాధి కోసం వరంగల్కు వచ్చిన సోను అనే యువకుడు కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు.
అందులో భాగంగా చనిపోవడానికి రైలు పట్టాలపై పడుకున్నాడు. అదే సమయంలో అటు నుంచి గూడ్స్ రైలు వస్తుండటాన్ని గమనించిన హోంగార్డు రవి తన ప్రాణాలకు తెగించి పట్టాలపై పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ యువకుడిని అక్కడినుంచి లేపి ఈడ్చుకుంటూ వచ్చాడు. దీంతో ఓ నిండు ప్రాణాన్ని కాపాడాడు.
సోనుకు ఆ హోంగార్డు పునర్జన్మని ఇచ్చాడనే చెప్పాలి. యువకుడి ప్రాణాలు కాపాడిన హోంగార్డును స్థానికులు అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.