ఢిల్లీలో కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద పాపం ఎంత మంది ఉన్నారో..

 ఢిల్లీలో కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద పాపం ఎంత మంది ఉన్నారో..

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఉదయం విషాద ఘటన జరిగింది. కరోల్బాగ్ ప్రాంతంలో రెండస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. బుధవారం ఉదయం 9 గంటల 11 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం స్పాట్కు చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేసింది.

 

ఢిల్లీలో ఇటీవల భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. అంతెందుకు.. మంగళవారం సాయంత్రం కూడా ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. పాత భవనం కావడం, వర్షాలు విపరీతంగా కురవడంతో బుధవారం ఉదయం ఈ భవనం కుప్పకూలింది.

also read : బుల్డోజర్ కూల్చివేతలు ఆపండి.. ఎప్పటి వరకంటే..

2024 సెప్టెంబర్ 17న మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఢిల్లీలోని నోయిడా సెక్టార్ 14, ఢిల్లీ సౌత్ ఎక్స్ టెన్షన్, ఘజియాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్లు మేరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు 2024 సెప్టెంబర్ 18న కూడా ఢిల్లీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 25నుంచి -35 కి.మీ వేగం తో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.