షార్ట్‌‌ సర్క్యూట్‌‌తో ఇల్లు దగ్ధం

షార్ట్‌‌ సర్క్యూట్‌‌తో ఇల్లు దగ్ధం

బెల్లంపల్లి రూరల్, వెలుగు : షార్ట్‌‌ సర్క్యూట్‌‌ కారణంగా ఓ ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటన భీమిని మండలంలోని వెంకటాపూర్‌‌ గ్రామంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన అంబిలపు సుధాకర్‌‌ తన భార్యతో కలిసి కూలీ పనికి వెళ్లారు. అతడి కొడుకు స్కూల్‌‌కు వెళ్లడంతో ఇంటికి తాళం వేసి ఉంది. ఆ టైంలో ఇంట్లో షార్ట్ సర్క్యూట్‌‌ ఏర్పడడంతో మంటలు అంటుకొని ఇల్లు, ఇంట్లోని వస్తువులు, రూ. లక్ష కాలిబూడిద అయ్యాయి. సిలిండర్‌‌ సైతం పేలినప్పటికీ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 

మంటలను గమనించిన స్థానికులు ఫైర్‌‌ ఇంజిన్‌‌కు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలు ఆర్పివేశారు. ప్రమాదంలో రూ.6 లక్షల వరకు నష్టం జరిగిందని బాధితుడు తెలిపారు. సంఘటనా స్థలాన్ని కన్నెపల్లి ఎస్సై గంగారాం, రెవెన్యూ ఇన్స్‌‌పెక్టర్‌‌ కిషన్‌‌రావు సందర్శించారు.