హైదరాబాద్ : సనత్ నగర్ హెచ్ పీ రోడ్ లోని స్క్రాప్ గోదాంలో భారీ పేలుడు సంభవించింది. గోడౌన్ లోని స్క్రాప్ ను ఆటోలో లోడ్ చేస్తుండగా ఉన్నట్టుండి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. కాలు, చేతులు చిధ్రమయ్యాయి. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు.
పేలుడు సంభవించిన సమయంలో పరిసర ప్రాంతంలో చాలామంది అటు ఇటు తిరుగుతున్నారు. పేలుడు సంభవించిన సమయంలో పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే పేలుడు ఘటనలో ఒక వ్యక్తి రక్తపు మడుగు కూప్పకూలి కనిపించాడు. అతడి అర్తనాదాలు విన్న స్థానికులు ఏమీ చేయలేకపోయారు. దగ్గరకు వెళ్తే మళ్లీ పేలుడు జరుగుతుందోనన్న భయంతో కాసేపు దూరంగా ఉన్నారు. విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు సంభవించడానికి అసలు కారణాలు ఏంటో తేల్చే పనిలో పడ్డారు.