హైదరాబాద్లో ఇంట్లో నిల్వ ఉంచిన బాణసంచా పేలి ఇద్దరు మృతి

హైదరాబాద్లో ఇంట్లో నిల్వ ఉంచిన బాణసంచా పేలి ఇద్దరు మృతి

హైదరాబాద్: పాతబస్తీలోని యాకత్పుర భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాణసంచా నిల్వ ఉంచిన ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న ఉషాబాయి, మోహన్ లాల్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వీరి కూతురు శృతిగుప్త (20) యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఇంట్లో భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమంగా బాణసంచా నిల్వ ఉంచినట్టు గుర్తించారు.