![ప్రొద్దుటూరు షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం](https://static.v6velugu.com/uploads/2024/01/a-huge-fire-accident-in-proddatur-shopping-mall_npM3kPYjxl.jpg)
వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 2024 జనవరి 29వ తేదీ ఉదయం ఆకృతి షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం జరగగా రెండు అంతస్తుల్లో దట్టమైన పొగ అలముకుంది. దీంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
పొగ బయటికి వెళ్లే మార్గం లేకపోవడంతో షాపింగ్ మాల్ ముందున్న అద్దాలను సిబ్బంది ధ్వంసం చేశారు. పొగ పీల్చుకోవడంతో అగ్నిమాపక సిబ్బంది సాంబ శివారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రకి తరలించారు.
షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదం వలన భారీగానే ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచానా వేస్తున్నారు.